Actor Rio Kapadia
Rio Kapadia – Bollywood: బాలీవుడ్ నటుడు రియో కపాడియా గురువారం కన్నుమూశారు. ఆయనకు క్యాన్సర్ సోకిందని గత ఏడాది వైద్యులు నిర్ధారించారు. ఇవాళ పరిస్థితి విషమించి రియో కన్నుమూశారని ఆయన స్నేహితుడు ఫైసల్ మాలిక్ తెలిపారు.
రియో అంత్యక్రియలు శుక్రవారం ముంబైలోని గోరెగావ్, శివ్ ధామ్ శంషన్ భూమిలో జరుగుతాయి. రియోకు భార్య, మేరియా ఫరా, కుమారులు అమన్, వీర్ ఉన్నారు. రియో కపాడియా చక్ దే ఇండియా, హ్యాపీ న్యూ ఇయర్, మర్దానీ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న మేడిన్ హీవెన్ 2లో కూడా ఆయన నటించారు. టీవీ షోల ద్వారా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సప్నే సుహానే లడక్‌పాన్ కే సీరియల్లో నటించారు.
సిద్ధార్థ్ తివారీ రూపొందించిన మహాభారత్ సీరియల్లో రియో కపాడియా గాంధారీ తండ్రి గాంధార రాజు సుబలగా నటించారు. రియో కపాడియా మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.