Actor Sai Kiran Engaged with Artist Sravanthi Photos goes Viral
Sai Kiran : ఒకప్పుడు హీరోగా, నటుడిగా పలు సినిమాలు చేసిన సాయి కిరణ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ, రెగ్యులర్ గా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తన మొదటి సినిమా నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది.. సాంగ్ తో బాగా వైరల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేమించు లాంటి మంచి హిట్ కొట్టాడు. అక్కడ్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సాయి కిరణ్ సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
సాయి కిరణ్ తండ్రి ప్రముఖ సింగర్ రామకృష్ణ. గతంలో సాయి కిరణ్ వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరిద్దరికి కొన్నేళ్ల క్రితమే విడాకులు అయ్యాయి. వీరికి ఒక పాప కూడా ఉంది. విడాకుల తర్వాత సాయి కిరణ్ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. తనతో పాటు కోయిలమ్మ సీరియల్ లో నటించిన స్రవంతి అనే నటిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ సీరియల్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి స్నేహంగా మారి అనంతరం ప్రేమలో పడ్డారు.
గత కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్న సాయి కిరణ్, స్రవంతి తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫోటోలు షేర్ చేసి నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు, పలువురు టీవీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.