Actor Shafi : ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి నటుడు షఫీ.. బెస్ట్ యాక్టర్ విభాగంలో..

ఖడ్గం, ఛత్రపతి, ఖలేజా, గోల్కొండ హై స్కూల్, గాడ్ ఫాదర్.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటుడు షఫీ ఇటీవల ఓ షార్ట్ ఫిలింలో నటించాడు. అమిత్ రాయ్ వర్మ తెరకెక్కించిన 3:15 A.M. అనే ఓ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిలింలో షఫీ మెయిన్ లీడ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిలిం..............

Actor Shafi :  ఇటీవల ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంది. సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ అని సంబంధం లేకుండా పలు ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ వేదికల వద్ద అవార్డులు అందుకుంటున్నాయి. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో భాగమవుతున్నాయి. ఇటీవలే రెండు ఇండియన్ షార్ట్ ఫిలిమ్స్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ బరిలో నిలిచింది.

ఖడ్గం, ఛత్రపతి, ఖలేజా, గోల్కొండ హై స్కూల్, గాడ్ ఫాదర్.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటుడు షఫీ ఇటీవల ఓ షార్ట్ ఫిలింలో నటించాడు. అమిత్ రాయ్ వర్మ తెరకెక్కించిన 3:15 A.M. అనే ఓ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిలింలో షఫీ మెయిన్ లీడ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిలిం ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు. ప్రస్తుతం పలు ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే లాస్ ఏంజెల్స్ ఫీడ్ బ్యాక్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ షార్ట్ ఫిలింగా కూడా అవార్డు గెలుచుకుంది.

Sukumar : పుష్ప హిట్ అవ్వడానికి అది కూడా కారణమే.. అందుకే పుష్ప 2 రాసేటప్పుడు..

తాజాగా ఈ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 నామినేషన్ లిస్ట్ లో నిలిచింది. ఈ సినిమా బెస్ట్ షార్ట్ ఫిలింతో పాటు, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటర్ విభాగాల్లో కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నిలిచింది. దీంతో షఫీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. షఫీ ఈ 3:15 A.M. షార్ట్ ఫిలిమ్స్ కి గాను బెస్ట్ యాక్టర్ గా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ నామినేషన్స్ లో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు షఫీ ఈ అవార్డు సాధించాలని కోరుకుంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు