Shakeela Remuneration : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. తొలి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathode), రెండో వారంలో షకీలా (Shakeela) హౌజ్ నుంచి బయటకు వచ్చారు. షకీలా ఎలిమినేట్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె వయసు కారణంగా హౌజ్‌లో యాక్టీవ్‌గా ఉండలేకపోయింది. గేమ్స్, టాస్క్‌లలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. అందరితో కలుపుగోలుగా ఉన్నప్పటికీ ఆమె ఎక్కువగా స్మోకింగ్ రూమ్‌లోనే కనిపించింది. ఇక హౌజ్‌లో ఆమెను అందరూ అమ్మ అని పిలిచారు. వారికి దగ్గరైనప్పటికీ ప్రేక్షకులకు మాత్రం చేరువకాలేకపోయింది. దీంతో ఆమెకు తక్కువ ఓట్లు పడడంతో రెండో వారంలోనే ఇంటిని వీడింది.
బిగ్‌బాస్ హౌజ్‌లోకి రావడం వల్ల షకీలాకు మంచే జరిగింది. ఇంతకముందు వరకు ఆమెపై శృంగార తార అభిప్రాయం మాత్రమే ఉండేది. అయితే.. బిగ్‌బాస్ వల్ల చాలా మంది తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కుటుంబ పెద్దగా ఎంతో హుందాగా వ్యవహరించింది. మంచి పేరు తెచ్చుకుంది. తనకు పిలుపు వచ్చింది కదా అని షోకి వచ్చినట్లు చెప్పింది. పెద్దగా ప్రిపరేషన్ అంటూ ఏమీ లేవని, తాను బయట ఎలా ఉంటానో అలాగే ఉన్నట్లు చెప్పింది.
Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందే అత్తారింటిలో లావణ్య త్రిపాఠి పండగ వేడుక..
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌజ్‌లో రెండు వారాలే ఉన్నప్పటికీ ఆమె గట్టిగానే సంపాదించిందట. ఆమెకు నిర్వాహకులు వారానికి రూ.3.5 లక్షలు ఫిక్స్ చేశారట. ఈ లెక్కన రెండు వారాలకు గాను రూ.7 నుంచి రూ. 8 లక్షలకు పైగా రెమ్యునరేషన్ రూపంలో అందుకుందనే టాక్ వినిపిస్తోంది.