Actor Sivaji shocking comments on Tollywood industry
Sivaji: టాలీవుడ్ నటుడు శివాజీ(Sivaji) తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఐబొమ్మ రవి అరెస్ట్ నేపధ్యంలో ఆయన ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు సినిమా గురించి, ఇక్కడ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్స్, లాభాలు, పైరసి, చిన్న సినిమాలు, టికెట్ రేట్స్ ఇలా చాలా అంశాల మీద కామెంట్స్ చేశారు.
Ram Charan: ఉదయపూర్ లో రాయల్ రామ్ చరణ్.. మంతెన వారి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్
“చాలా మంది అనుకున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలు, అందరు డైరెక్టర్లకు, అందరు యాక్టర్లు భారీగా రెమ్యునరేషన్లు తీసుకోవడం లేదు. అందరు నిర్మాతలకు భారీగా లాభాలు రావడం లేదు. ఇక్కడ కేవలం 5 శాతం మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు మాత్రమే భారీగా డబ్బులు, భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. అలాంటి వాళ్లకే రెమ్యునరేషన్లు భారీగా ఇస్తున్నారు. లాభాలు కూడా ఎక్కువగా ఇస్తున్నారు.
మరి మిగతా 95 శాతం మంది పరిస్థితి ఏంటి. వాళ్ళు సాదా సీదాగానే సినిమాలు చేస్తున్నాడు, కెరీర్ లీడ్ చేస్తున్నారు. కేవలం ఆ ఐదు శాతం మంది వల్ల మిగతా ఇండస్ట్రీ అంతా ఎఫెక్ట్ అవుతోంది. వాళ్లను చూసి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే అనుకోవడం,తిట్టడం కరెక్ట్ కాదు. పైరసీని నేను కూడా వ్యతిరేకిస్తాను. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. ఐ బొమ్మ రవి చేసింది కూడా పెద్ద తెప్పే. ఇంత టెక్నాలజీని వాడినా కూడా అతను పైరసీ చేయగలిగాడు అంటే అతని ట్యాలెంట్ మన దేశానికి ఉపయోగపడాలి. ఇక సినిమా టికెట్ల విషయానికి వస్తే, పెద్ద సినిమాలకు మాత్రమే పెరుగుతున్నాయి. ఆ ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు. లేనివాళ్లు చూడరు. ఆ విషయంపై చాలా మంది కామెంట్స్ చేస్తారు. కానీ, బస్ ఛార్జీలు పెంచినప్పుడు మాత్రం ఒక్కరు కూడా మాట్లాడరు. అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విరాళ అవుతున్నాయి.