Sivakarthikeyan Green India Challenge
Sivakarthikeyan Green India Challenge : ‘రెమో’, ‘డాక్టర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan ). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మావీరన్’. మడోనా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘మహావీరుడు’ (Mahaveerudu) పేరుతో విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జూలై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Project K T-shirt : ‘ప్రాజెక్ట్ K’ టీ షర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి
Sivakarthikeyan Green India Challenge
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన శివకార్తికేయన్ హీరోయిన్ నందితా శ్వేతా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కేబీఆర్ పార్క్‌లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని, రాబోయే జనరేషన్‌కు మనం అందించే కానుక అని అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి, నాటించాలి అని పిలుపునిచ్చారు.
Sivakarthikeyan Green India Challenge
గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెలుతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ కృషిని అభినందించారు. అనంతరం తన స్నేహితుడు, తమిళ రాక్‌స్టార్ అనిరుధ్(Anirudh Ravichander)కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధిపతి, సినీ నిర్మాత జాన్వీ నారాంగ్ తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యులు పాల్గొన్నారు.
Yash : నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చిన యశ్.. భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా కాదట!
Sivakarthikeyan Green India Challenge