400 ల కుటుంబాలకు దేవుడు.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

  • Publish Date - July 13, 2020 / 03:07 PM IST

కరోనా కష్ట కాలంలో పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే నటుడు సోనూ సూద్ తనకున్నదానిలో వివిధ రకాలుగా కాస్త ఎక్కవ సహాయమే చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వైద్యులు మరియు సిబ్బందికి తన హోటల్లో ఉచితంగా బస కల్పించడం.. లాక్‌డౌన్‌ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు కృషి చేయడం పైగా వారికోసం చార్టర్డ్‌ విమానాలను కూడా ఏర్పాటు చేయడం.. ఇలా తన వంతు సేవా కార్యక్రమాలు చేసిన సోనూ సూద్ తాజాగా మరో మంచి నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా అమలైన వివిధ దశల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇంటి బాట పట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వలస కార్మికుల కుటుంబాలకు సోను సూద్ అండగా నిలవనున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోమవారం తాజాగా ప్రకటించారు.

కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాననీ వారికి మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నానని సోనూ సూద్ తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సేకరించారాయన. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు సోనూ సూద్.. అతను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడని, 400ల పేద కుటుంబాల పాలిట దేవుడిలా నిలిచాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read Here>>చైనా మార్కెట్ నుంచి బయటపడుతున్న బాలీవుడ్

ట్రెండింగ్ వార్తలు