Site icon 10TV Telugu

Sudheer Babu : భార్య పెళ్లి చూపుల ఫోటో షేర్ చేసిన హీరో.. అప్పటికి, ఇప్పటికి ఎంత మారిపోయిందో చూడండి..

Actor Sudheer Babu Shares her Wife before Wedding Photo and says wishes

Actor Sudheer Babu Shares her Wife before Wedding Photo and says wishes

Sudheer Babu : హీరో సుధీర్ బాబు భార్య పద్మిని ప్రియదర్శిని(Padmini Priyadharshini) మహేష్ బాబు(Mahesh Babu) చెల్లి అని తెలిసిందే. సుధీర్ బాబు – ప్రియదర్శిని వివాహం 2006లో జరిగింది. సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా బిజీగానే ఉన్నాడు. సుధీర్ బాబు పలు మార్లు భార్యతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రియదర్శిని కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంది.

Also Read : Chiranjeevi – Ajith : తమిళ్ స్టార్‌ హీరోతో మన మెగాస్టార్.. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోలు..

అయితే నేడు సుధీర్ బాబు – ప్రియదర్శిని వివాహ వార్షికోత్సవం కావడంతో సుధీర్ బాబు తన భార్య పెళ్లి చూపుల ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. సుధీర్ బాబుకు పెళ్లి చూపులకు పంపించిన ప్రియదర్శిని ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ యానివర్సరీ మై లవ్. నా దగ్గరికి వచ్చిన నీ మొదటి ఫొటో, పెళ్లిచూపులు ఫొటో అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ప్రియదర్శిని అప్పటికి, ఇప్పటికి చాలా మారిపోయింది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చూపుల ఫోటోని ఇంకా జాగ్రత్తగా దాచుకున్నారు అంటే గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version