Actor Sudheer Varma: టాలీవుడ్‌లో మరో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యంగ్ హీరో సుధీర్ వర్మ!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ-నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. ఆయనతో కలిసి సుధీర్ వర్మ ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో సుధీర్ వర్మ మంచి పేరును సంపాదించుకున్నాడు.

Actor Sudheer Varma Commits Suicide

Actor Sudheer Varma: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ-నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. ఆయనతో కలిసి సుధీర్ వర్మ ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో సుధీర్ వర్మ మంచి పేరును సంపాదించుకున్నాడు.

తెలుగులో ‘కుందనపు బొమ్మ’, ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి సినిమాల్లో సుధీర్ వర్మ నటించాడు. అయితే ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల వైజాగ్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న నిజాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. తనతో మంచి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటుడు సుధాకర్ కోమాకుల తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

సుధీర్ వర్మ ఆత్మహత్య గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సుధీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. ఇలా ఓ యంగ్ హీరో ఆత్మహత్యకు పాల్పడటంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.