Actor Suhas wife lalitha deliver baby boy
Suhas : నటుడు సుహాస్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లలిత పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సుహాస్ తెలియజేశాడు. తన భార్య, కొడుకుతో ఉన్న ఫోటోను సుహాస్ (Suhas) పంచుకున్నాడు. ఈ విషయం తెలిసి నెటిజన్లు, సినీ ప్రముఖలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. వీరికి తొలి సంతానంగా కూడా కొడుకే జన్మించిన సంగతి తెలిసిందే.
సుహాస్ భార్య పేరు లలిత. వీరిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఏడేళ్లకు అంటే 2024లో వీళ్లకి తొలి సంతానంగా బాబు జన్మించాడు. ఇప్పుడు మరోసారి కూడా అబ్బాయే పుట్టాడు.
Varalaxmi Sarathkumar : దర్శక నిర్మాతగా మారిన నటి..
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ‘కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం సుహాస్ కోలీవుడ్‌లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తొలిసారి ఆయన విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూరి హీరోగా నటిస్తున్నారు. ఇటీవల సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలోని లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.