Sumanth Second Marriage : రెండో పెళ్లి.. ఆర్జీవీ రెస్పాన్స్, సుమంత్ రిప్లయ్.. అసలు నిజం ఇదే
అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారని పుకార్లు వినిపించాయి. సుమంత్ వెడ్స్ పవిత్ర పేరుతో ఒక వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లి కార్డును చూసి చాలామంది
- Naveen
- Published On : July 29, 2021 / 10:29 PM IST
Sumanth Second Marriage
Sumanth Second Marriage : అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారని పుకార్లు వినిపించాయి. సుమంత్ వెడ్స్ పవిత్ర పేరుతో ఒక వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లి కార్డును చూసి చాలామంది సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ భావించారు. ఈ విషయమై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కూడా ట్వీట్ చేశారు.
తాజాగా ఈ వదంతులపై హీరో సుమంత్ స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, అవన్నీ రూమర్లే అని కొట్టిపడేశారు. రియల్ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పారు. అయితే, వైరల్ అయిన వెడ్డింగ్ కార్డు తన తదుపరి సినిమాకి సంబంధించినది అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లి, విడాకులకు సంబంధించి ఓ సినిమా చేస్తున్నానని, ఆ ఫిల్మ్ షూట్ నుంచి ఒక పెళ్లి కార్డు ఫోటో లీకైందని సుమంత్ వివరించారు. ఆ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు.
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ’ చిత్రంతో సుమంత్ కెరీర్ ప్రారంభించారు. 2003లో సుమంత్ హీరోగా వచ్చిన ‘సత్యం’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘గౌరీ’, ‘ధన 51’, ‘మహానంది’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ నటించిన ‘గోదావరి’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మంచి కథా బలమున్న సినిమాలు ఎంచుకుంటూ సాగిపోతున్నారు.
?? Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me ? https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021
