Sunny Deol : ఫుల్లుగా తాగి రోడ్డుపై వీరంగం.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

రీసెంట్‌గా ఓ బాలీవుడ్ స్టార్ రోడ్డుపై తప్పతాగి తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ నటుడు ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చారు.

Sunny Deol

Sunny Deol : తెరపై చూసే ఓ ప్రముఖ నటుడు రోడ్డుపై తప్ప తాగి తూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఆ నటుడిపై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. దాంతో ఆ నటుడు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరా నటుడు? ఏం జరిగింది?

Sunny Deol 1

Manchu Manoj : ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి ఇండస్ట్రీకి వచ్చాను.. మనోజ్ కొత్త షో లాంచింగ్.. ఎప్పట్నించి స్ట్రీమింగ్?

పవన్ శుక్లా (Pawan Shukla) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ వీడియో ఇంటర్నెట్‌లో తుపానుగా మారింది. వీడియోలో సన్నీ ఫుల్లుగా తాగి రోడ్డు మీద తూలుతూ వెళ్తుంటాడు. అతని పక్కన ఆటో ఆగుతుంది. ఆటోవాలా అతనిని బలవంతంగా ఆటో ఎక్కించుకుని తీసుకుని వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. ‘బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ రాత్రి వేళ ఎక్కడికి వెళ్లారు? చూస్తుంటే బాగా మద్యం తాగినట్లు కనిపిస్తున్నారు?’ అనే ట్యాగ్ లైన్‌తో పోస్ట్ చేశారు.

ఇక ఇలాంటి వీడియోలు చూస్తే నెటిజన్లు ఊరుకుంటారా? సన్నీని దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టారు. సెలబ్రిటీ అయి ఉండి ఇలా పబ్లిక్‌గా తాగి తూలడం ఏంటని ప్రశ్నించారు. ఇక ఈ ట్రోలింగ్‌కు చెక్ పెట్టడానికి సన్నీ డియోల్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు అక్కడేం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఒరిజినల్ వీడియోను పోస్టు చేసారు సన్నీ. మేటర్ ఏంటంటే సన్నీ డియోల్ ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా మందు కొట్టి తూలుతున్నట్లు నటించారు. సన్నీ చుట్టూ ఉన్న కెమెరాలను బట్టి విషయం అర్ధం అవుతుంది. పుకార్లకు చెక్ పెడతారని భావిస్తున్నానంటూ సన్నీ పోస్ట్ చేయడంతో ఇదంతా కొందరు కావాలని చేసే పని.. ఇవేం పట్టించుకోవద్దని సన్నీకి సూచించారు నెటిజన్లు.

Khushi Kapoor : శ్రీదేవిని గుర్తు చేస్తున్న చిన్న కూతురు.. అమ్మ గర్వపడేలా చేశావు అంటూ జాన్వీ పోస్ట్..

ఇదంతా ప్రమోషన్‌లో భాగంగా చేసిన స్టంట్ అని కొందరు నెటిజన్లు భావించారు. ఏది ఏమైనా సన్నీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గదర్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సన్నీ ప్రస్తుతం బాప్, లాహోర్ 1947, సూర్య ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు