Manchu Manoj : ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి ఇండస్ట్రీకి వచ్చాను.. మనోజ్ కొత్త షో లాంచింగ్.. ఎప్పట్నించి స్ట్రీమింగ్?

తాజాగా నేడు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ షో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ప్రోమో రిలీజ్ చేశారు. అనంతరం మనోజ్, షో నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.

Manchu Manoj : ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి ఇండస్ట్రీకి వచ్చాను.. మనోజ్ కొత్త షో లాంచింగ్.. ఎప్పట్నించి స్ట్రీమింగ్?

Manchu Manoj Speech in his new Show Ustaad Launching Event and Ustaad Promo

Manchu Manoj : మంచు మనోజ్ చివరిసారిగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 6 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు. కానీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రెండో పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒకేసారి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మనోజ్.

మంచు మనోజ్ ఇటీవల కొన్నాళ్ల క్రితం భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా రెండు సినిమాలు కూడా ప్రకటించాడు. ఇప్పుడు యాంకర్ గా ఒక కొత్త షోతో రాబోతున్నాడు. మంచు మనోజ్ హోస్ట్ గా ఓ సెలెబ్రిటీ – ఫ్యాన్స్ షోని ఈ విన్ ఓటీటీ కోసం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ కూడా షూటింగ్ అయిపోయాయి. ఇటీవలే ఈ షోకి ఉస్తాద్ అనే టైటిల్ ని ప్రకటించారు. రాంప్ ఆడిద్దాం అనే సబ్ టైటిల్ ని కూడా ఇచ్చారు.

తాజాగా నేడు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ షో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ప్రోమో రిలీజ్ చేశారు. అనంతరం మనోజ్, షో నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. ఏడేళ్ల గ్యాప్ లో చాలా చూశాను. అప్పట్లో ఫ్యాషన్ తో సినిమాలు చేసేవాడ్ని. ఇప్పుడు బాధ్యతతో చేస్తున్నాను. మౌనికతో ప్రేమలో పడ్డాకే నా ఫ్యాన్స్ ప్రేమ కూడా కనిపించింది. ఇంత గ్యాప్ వచ్చినందుకు నన్ను క్షమించాలి. ఇకపై పటాకులు పేలతాయి. త్వరలో ఇంకో మంచి న్యూస్ కూడా చెప్పబోతున్నాను. ఇది చాలా కొత్త షో. ఈ షోలో ఒక ఫ్యాన్ ని తీసుకొచ్చి సెలెబ్రిటీలు ఆ ఫ్యాన్ కోసం ఆడతారు. షో షూటింగ్ అయ్యాక ఏదో తెలియని బాధ అనిపించింది. నా ఫ్యాన్స్ కోసమే ఈ షో ఒప్పుకున్నాను. ఈ షో అయిపోయింది. అన్ని షోలలో డబ్బులు అని చెప్తారు, కానీ ఇవ్వరు. ఇందులో మాత్రం నిజంగా డబ్బులు ఇచ్చి పంపిస్తాము. నాకు సపోర్ట్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్. కంబ్యాక్ అనగానే సినిమాల్లో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ కొత్తగా చేయాలని ఈ షో చేసాను. జనాలతో కనెక్ట్ అవ్వడానికి ఈ షో చేశాను అని అన్నారు.

Also Read : Khushi Kapoor : శ్రీదేవిని గుర్తు చేస్తున్న చిన్న కూతురు.. అమ్మ గర్వపడేలా చేశావు అంటూ జాన్వీ పోస్ట్..

ఇక ఈ ఉస్తాద్ వీక్లి షో. ఈ విన్ ఓటీటీలో డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. నేడు ఉస్తాద్ షో లాంచింగ్ ఈవెంట్ కి మంచు మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.

Manchu Manoj Speech in his new Show Ustaad Launching Event and Ustaad Promo