Khushi Kapoor : శ్రీదేవిని గుర్తు చేస్తున్న చిన్న కూతురు.. అమ్మ గర్వపడేలా చేశావు అంటూ జాన్వీ పోస్ట్..

ఖుషి కపూర్ ఈ ప్రీమియర్ లో తన డ్రెస్సింగ్ తో మెరిపించడం మాత్రమే కాక శ్రీదేవి అభిమానులని కూడా మెప్పిస్తుంది.

Khushi Kapoor : శ్రీదేవిని గుర్తు చేస్తున్న చిన్న కూతురు.. అమ్మ గర్వపడేలా చేశావు అంటూ జాన్వీ పోస్ట్..

Kushi Kapoor Wears her Mother Sridevi Dress after Ten Years in The Archies Movie Premiere Show

Updated On : December 6, 2023 / 4:43 PM IST

Khushi Kapoor : అందాల తార, దివంగత నటి శ్రీదేవి(Sridevi) తన సినిమాలతో దాదాపు కొన్ని దశాబ్దాలపాటు సౌత్, బాలీవుడ్ సినిమాలను ఏలింది. ఆమె వారసురాలుగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఆల్రెడీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్(Zoya Akhtar) దర్శకత్వంలో ‘ది ఆర్చీస్'(The Archies) అనే సినిమాను షారుఖ్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్, అమితాబ్ మనవడు అగస్త్య నందతో పాటు పలువురు కొత్తవాళ్ళతో తెరకెక్కిస్తోంది.

ది ఆర్చీస్ సినిమా డిసెంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. బాలీవుడ్ స్టార్ వారసులు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాని పలువురు ప్రముఖుల కోసం ముంబైలో నిన్న రాత్రి స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఈ ప్రీమియర్ షోకి చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ లోని అనేకమంది ప్రముఖులు వచ్చి సందడి చేశారు. అయితే ఖుషి కపూర్ ఈ ప్రీమియర్ లో తన డ్రెస్సింగ్ తో మెరిపించడం మాత్రమే కాక శ్రీదేవి అభిమానులని కూడా మెప్పిస్తుంది.

అందుకు కారణం ఖుషి కపూర్ వేసుకున్న డ్రెస్. శ్రీదేవి 2013 ఐఫా అవార్డుల్లో ఓ మెరిసేటి సిల్వర్ డ్రెస్ వేసుకుంది. అప్పట్లో ఆ డ్రెస్ లో శ్రీదేవి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు పదేళ్ల తర్వాత ఖుషి కపూర్ మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని తన మొదటి సినిమా ప్రీమియర్ కి వచ్చింది. ఆ డ్రెస్ ని ఇప్పుడు తనకు తగ్గట్టు మార్చుకొని వేసుకొచ్చింది ఖుషి. అలాగే తన తల్లి డైమండ్ నెక్లెస్ ని ధరించి మరీ వచ్చింది. దీంతో ఖుషి కపూర్ ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాక శ్రీదేవి, ఖుషి కపూర్ ఫోటోలు పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read : Renu Desai : యానిమల్ సినిమాపై రేణు దేశాయ్ రివ్యూ.. ఏమందో తెలుసా?

ఇక ఖుషి కపూర్ ఈ స్పెషల్ డ్రెస్ లో కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జాన్వీ కపూర్ కూడా ఈ ప్రీమియర్ షోకి హాజరవ్వగా చెల్లితో ఫోటోలు దిగింది. ఖుషితో దిగిన ఫోటోని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఇన్నాళ్లు నా లైఫ్ కి నువ్వు సూర్యకాంతి లాంటి దానివి, ఇప్పుడు సినిమాలకి అని పోస్ట్ చేసింది. అలాగే ఖుషి కపూర్ ఫోటోలని రీ షేర్ చేస్తూ.. నువ్వు అమ్మ గర్వంగా ఫీల్ అయ్యేలా చేశావు, ఐ లవ్ యు అని పోస్ట్ చేసింది. దీంతో ఖుషి కపూర్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.