Venu Thottempudi : సినీ పరిశ్రమలో విషాదం.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన హీరో.. అంతలోనే తండ్రి మరణం..

ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ తర్వాత మళ్ళీ సిరీస్ లు, సినిమాలు అని వేణు బిజీ అవుతున్న సమయంలో అతని ఇంట్లో ఇలా విషాదం నెలకొనడం బాధాకరం.

Actor Venu Thottempudi Father Thottempudi Venkata Subbarao Passes Away

Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) ఆ సినిమాతో మంచి విజయం సాధించి ఆ తర్వాత చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి.. ఇలా వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కానీ అనుకోకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళకు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు గారు నేడు ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయనకు 92 సంవత్సరాలు. వయోభారంతో పలు ఆరోగ్య సమస్యలతో ఆయన నేడు కన్నుమూశారు. దీంతో వేణు కుటుంబం విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు వేణు తండ్రి వెంకట సుబ్బారావుకు నివాళులు అర్పిస్తున్నారు. వెంకట సుబ్బారావు భౌతికకాయాన్ని ప్రముఖుల సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వారి స్వగృహం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్ వద్ద ఉంచనున్నారు. అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12.30 తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read : Nagarjuna : మళ్ళీ వచ్చే సంక్రాంతికి వస్తాను.. క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున.. 2025 సంక్రాంతి పోటీ ఫిక్స్..

ఇక వేణు ఇటీవల రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించాడు. కొన్ని రోజుల క్రితమే ఓటీటీలో ‘అతిథి'(Athidhi) అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ తర్వాత మళ్ళీ సిరీస్ లు, సినిమాలు అని వేణు బిజీ అవుతున్న సమయంలో అతని ఇంట్లో ఇలా విషాదం నెలకొనడం బాధాకరం.