Site icon 10TV Telugu

Vishal engagement : హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్‌

Actor vishal engagement with actress sai dhanshika

Actor vishal engagement with actress sai dhanshika

vishal engagement : త‌మిళ స్టార్ హీరో విశాల్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న‌టి సాయి ధ‌న్సిక‌తో తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించాడు కూడా.

కాగా.. నేడు (శుక్ర‌వారం ఆగ‌స్టు 29) విశాల్‌, సాయి ధన్సిక ఎంగేజ్ జ‌రిగింది(vishal engagement). చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. కాగా.. నేడు విశాల్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే.

Pawan Kalyan : OG ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ కి పవర్ స్టార్.. రెండు రోజులు.. ట్రైలర్ అప్పుడే?

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన సంబంధించిన ఫోటోల‌ను విశాల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారగా నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం విశాల్ మ‌కుటం అనే మూవీలో న‌టిస్తున్నాడు. ర‌వి అర‌సు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఆర్బీ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజ‌లి, దుషార విజ‌య‌న్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Exit mobile version