Pawan Kalyan : OG ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ కి పవర్ స్టార్.. రెండు రోజులు.. ట్రైలర్ అప్పుడే?

పవన్ ఎక్కడ కనపడినా OG OG అనే అరుస్తారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో దీనిపై హైప్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా OG తెరకెక్కుతుంది.(Pawan Kalyan)

Pawan Kalyan : OG ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ కి పవర్ స్టార్.. రెండు రోజులు.. ట్రైలర్ అప్పుడే?

Pawan Kalyan

Updated On : August 29, 2025 / 8:07 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరిహర వీరమల్లు కాస్త నిరాశపరచడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా OG తెరకెక్కుతుంది. పవన్ ఎక్కడ కనపడినా OG OG అనే అరుస్తారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో దీనిపై హైప్ ఉంది.(Pawan Kalyan)

ఈ సినిమాకు ఉన్న హైప్ తో దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా ఆల్మోస్ట్ 200 కోట్లకు జరిగింది. OG సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ట్రైలర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఉంటుందని టాక్.

Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..

అయితే హరిహర వీరమల్లు సినిమాకు పవన్ భారీగా ప్రమోషన్స్ చేసారు. తన కెరీర్ లో ఎక్కువగా ప్రమోషన్స్ చేసింది ఆ సినిమాకే. ఆ సినిమాకు ఎక్కువ ఖర్చు అవ్వడం, పలు మార్లు వాయిదా పడటం, నిర్మాత కోసం.. ఇలా పలు అంశాల వల్ల ప్రమోషన్స్ చేసారు. OG సినిమాకు పవన్ ప్రమోషన్స్ చేయరేమో అని అంతా భావించారు.

కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ OG ప్రమోషన్స్ కి రెండు రోజులు కేటాయించారు అని తెలుస్తుంది. సెప్టెంబర్ 18 తర్వాత పవన్ రెండు రోజులు OG సినిమా యూనిట్ కి డేట్స్ ఇచ్చారట. ఒక రోజు హైదరాబాద్ లో పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రెస్ తో మాట్లాడటం ఉంటుందట. మరో రోజు ఆంద్రలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట.

Also Read : Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ.. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి..

దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో సారి పవన్ సినిమా ప్రమోషన్స్ కి వస్తారని, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాడని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే OG కి ఉన్న హైప్ ఆకాశాన్ని అంటింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగితే మరింత అంచనాలు పెరగడం ఖాయం.