Abhinaya : పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్..

నిన్న ఏప్రిల్ 16 రాత్రి అభినయ పెళ్లి హైదరాబాద్ లో జరిగింది.

Actress Abhinaya Married with Karthik Photos goes Viral

Abhinaya : నటి అభినయ పలు సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగులో అభిన‌య శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధ్రువ, రాజుగారి గది 2, గాని, సీతారామం.. లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభినయ ప్రస్తుతం వరుస తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవల అభినయ కార్తిక్ అనే వ్యక్తిని 15 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను అని, పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

అనంతరం నిశ్చితార్థం, మెహందీ వేడుకలు, బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అభినయ.

నిన్న ఏప్రిల్ 16 రాత్రి అభినయ పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి వైభవంగా చేసారు. అభినయ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అభినయ పుట్టినప్పటినుంచి మూగ, చెవిటి అని తెలిసిందే. అయినా కష్టపడి తన కెరీర్ లో ఎదిగి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుండటంతో నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియచేస్తున్నారు.