Amy Jackson : రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్..

తాజాగా అమీ జాక్సన్ తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేయడంతో తను రెండోసారి తల్లి కాబోతున్నట్టు తెలుస్తుంది.

Actress Amy Jackson becoming Mother for Second time

Amy Jackson : బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ ప్రస్తుతం యూరప్ లో సెటిల్ అయిపోయింది. తెలుగు, తమిళ్ లో ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాలతో పాపులర్ అయింది ఈ భామ. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బాబుని కని ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది అమీ జాక్సన్.

Also See : Vijay Deverakonda : ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

ఇటీవల రెండు నెల క్రితం అమీజాక్సన్ హాలీవుడ్ న‌టుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన పలు ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా అమీ జాక్సన్ తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేయడంతో తను రెండోసారి తల్లి కాబోతున్నట్టు తెలుస్తుంది.

భర్త ఎడ్ వెస్ట్ విక్ తో క్యూట్ గా బేబీ బంప్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది అమీ జాక్సన్. దీంతో పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆమెకు విషెస్ చెప్తున్నారు.