Amy Jackson : ప్రియుడితో కొడుకుని కని.. ఇప్పుడు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..

అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకోకపోయినా అతనితో లివింగ్ రిలేషన్ లో ఉండి ఓ బాబుకి తల్లి అయింది.

Actress Amy Jackson Engaged with Ed Westwick in Switzerland Photos goes Viral

Amy Jackson : బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ తెలుగు, తమిళ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. పెళ్లి చేసుకోకపోయినా ఓ మూడేళ్లు అతనితో లివింగ్ రిలేషన్ లో ఉండి ఓ బాబుకి తల్లి అయింది అమీ జాక్సన్.

అయితే జార్జ్ తో విబేధాలు రావడంతో 2022లో అతని నుంచి విడిపోయింది అమీ జాక్సన్. కొంతకాలం తర్వాత ఎడ్ వెస్ట్‌విక్(Ed Westwick) అనే బ్రిటిష్ నటుడితో ప్రేమలో పడి అతనితో రిలేషన్ లో ఉంది. తాజాగా నిన్న స్విడ్జర్లాండ్ లోని మంచు పర్వతాల్లో ఓ వంతెన మీద ఎడ్ వెస్ట్‌విక్.. అమీ జాక్సన్ కి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇవ్వగా వెంటనే తొడిగించుకొని అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ జంట.

Also Read : Nagarjuna – Dhanush : తిరుపతిలో నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్.. అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్..

ఈ ఫోటోలను అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఎడ్ వెస్ట్‌విక్, అమీ జాక్సన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.