Nagarjuna – Dhanush : తిరుపతిలో నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్.. అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్..

ప్రస్తుతం ఈ నాగార్జున - ధనుష్ సినిమా షూటింగ్ తిరుపతిలోని అలిపిరి సమీపంలో జరుగుతుంది.

Nagarjuna – Dhanush : తిరుపతిలో నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్.. అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్..

Sekhar Kammula Nagarjuna Dhanush Movie Shooting happening in Tirupati Traffic Problems at Alipiri

Updated On : January 30, 2024 / 10:15 AM IST

Nagarjuna – Dhanush : ఇటీవల నా సామిరంగ(Naa Saami Ranga) సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సర్ సినిమాతో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మరో తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకుంది.

అయితే ప్రస్తుతం ఈ నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్ తిరుపతిలోని(Tirupati) అలిపిరి సమీపంలో జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే షూటింగ్ మొదలుపెట్టడంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ భారీగా ఎర్పడింది. ఓ వైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరో వైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కాసేపు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు.

Also Read : Anupama Parameswaran : మెడలో తాళి చూపిస్తూ అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు.. షాక్ అవుతున్న అభిమానులు..

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగార్జున ధనుష్ సినిమా కూడా ఆయన గత సినిమాల్లాగే క్లాసిక్ గా ఉంటుందని సమాచారం.