Anupama Parameswaran : మెడలో తాళి చూపిస్తూ అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు.. షాక్ అవుతున్న అభిమానులు..
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో, మెడలో తాళి చూపిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Anupama Parameswaran Shares Photos in Bride Getup Fans Shocked Photos goes Viral
Anupama Parameswaran : మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మలయాళం, తమిళ్ సినిమాలతో కూడా బిజీ అవుతుంది. మొదట్లో పద్ధతి గల పాత్రలు చేసిన అనుపమ ఆ తర్వాత మోడరన్, బోల్డ్ పాత్రలు కూడా చేస్తుంది. త్వరలో తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ, అప్పుడప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది.
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో, మెడలో తాళి చూపిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కొంతమంది ఏంటి తాళితో ఫొటోలు పెట్టావు అని అడుగుతుంటే, కొంతమంది చెప్పకుండా పెళ్లి చూసుకున్నావా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోలు ఒక సినిమా షూట్ కి సంబంధించినవి అని తెలుస్తుంది.
Also Read : Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డ్.. ఆ థియేటర్లో..
అనుపమ తమిళ్ లో జయం రవి(Jayam Ravi) సరసన సైరెన్(Siren) అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నేత్రు వరై..’ అని సాగే పాట రిలీజయింది. ఈ పాటలో జయం రవి, అనుపమ క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. దీంతో అనుపమ ఆ షూటింగ్ జరిగినప్పటి ఫోటోలని ఇప్పుడు సాంగ్ ప్రమోషన్ కోసం పోస్ట్ చేసింది. అయితే అనుపమ తాళి కట్టుకున్న ఫొటోలు చూసి మొదట షాక్ అవుతున్నారు అభిమానులు. పెళ్లి కూతురి గెటప్ లో క్యూట్ గా ఉన్న అనుపమ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.