Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డ్.. ఆ థియేటర్లో..

మహేష్ గుంటూరు కారం సినిమాతో పలు రికార్డులు రాగా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ అయింది.

Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డ్.. ఆ థియేటర్లో..

Mahesh Babu Guntur Kaaram Movie Creates New Record at Sudarshan Theater

Updated On : January 30, 2024 / 8:38 AM IST

Mahesh Babu Guntur Kaaram : మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఇటీవల సంక్రాంతికి వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమా ఇప్పటికే 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాతో మహేష్ పలు రికార్డులని సెట్ చేసాడు.

రీజనల్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. అలాగే వరుసగా రీజనల్ సినిమాలతో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా నిలిచాడు. అమెరికాలో వరుసగా 11వ సినిమాతో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటిన హీరోగా రికార్డ్ సెట్ చేసాడు మహేష్. ఇలా గుంటూరు కారం సినిమాతో పలు రికార్డులు రాగా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ అయింది.

హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ లో ఫుల్ ఎంజాయ్మెంట్ తో సినిమా చూడాలంటే RTC క్రాస్ రోడ్ లో ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య థియేటర్స్ లో చూడాల్సిందే. ఫ్యాన్స్ అంతా మొదటి రోజు తమ హీరోల సినిమాలు అక్కడే చూడాలనుకుంటారు. స్టార్ హీరో సినిమా రిలీజయితే ఆ థియేటర్ల వద్ద పండగ వాతావరణమే.

Also Read : 7 Immortals : ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో ఏడుగురు చిరంజీవులు? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కంటే ముందే..

తాజాగా మహేష్ అక్కడ ఉన్న సుదర్శన్ థియేటర్లో(Sudarshan Theater) గుంటూరు కారం సినిమాతో ఫాస్ట్ గా ఒక కోటి గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేసాడు. గుంటూరు కారం సినిమా సుదర్శన్ థియేటర్లో కేవలం 17 రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇంత ఫాస్ట్ గా ఏ సినిమా ఇప్పటివరకు చేయలేదు. అలాగే మహేష్ ఈ రికార్డును సుదర్శన్ థియేటర్లో ఏడు సార్లు సాధించాడు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.