7 Immortals : ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో ఏడుగురు చిరంజీవులు? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కంటే ముందే..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ ఏడుగురు చిరంజీవులు చూపించే ముందే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Nag Ashwin Planning 7 Immortals of Hindu Mythology Characters in Prabhas Kalki 2898 AD Movie before Prashanth Varma Cinematic Universe
Prabhas Kalki 7 Immortals : మన ఇతిహాసాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్న సంగతి తెలిసిందే. వేదం వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి. వీరిని చిరంజీవులు అంటారు. అంటే మరణం లేని వారు అని. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరివరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని కొన్ని పురాణాల్లో ఉన్నాయి. కొన్ని కొన్ని కారణాలతో వీరికి వరంగానో, శాపంగానో ఈ చిరంజీవి తత్వం వచ్చిందని పురాణాల్లో ఉంది.

Veda Vyasudu, Hanumanthudu, Parushuramudu, Vibheeshanudu
ఇటీవల మన సినిమాల్లో మన చరిత్ర, పురాణాలు తీసుకొని వాటి ఆధారంగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ హనుమంతుడి ఆధారంగా హనుమాన్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఏడుగురు చిరంజీవులు ఉంటారని కూడా చెప్పాడు. ఆల్రెడీ హనుమాన్ సినిమాలో హనుమంతుడు, విభీషణుడిని డైరెక్ట్ గా చూపించి బలి చక్రవర్తి కూడా ఉన్నట్టు క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు. తన నెక్స్ట్ సినిమా జై హనుమాన్ లో అందరు చిరంజీవులు కనిపిస్తారని టాక్ నడుస్తుంది.

Ashwathama, Krupacharyudu, Bali Chakravarthi
అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ ఏడుగురు చిరంజీవులు చూపించే ముందే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా భారీగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ చూసి కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. కల్కి సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా కూడా స్పెషల్ రోల్ పోషించబోతున్నట్టు ఇండైరెక్ట్ గా మూవీ యూనిట్ గతంలోనే చెప్పింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కల్కి సినిమాలు పలువురు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇవ్వబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.
ప్రభాస్ కల్కి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నానిలు, అలాగే రాజమౌళి కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ నడుస్తుంది. నాని, విజయ్ నాగ్ అశ్విన్ కి మంచి స్నేహితులు, దుల్కర్ ని తెలుగులో లాంచ్ చేసి ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చింది వైజయంతి నిర్మాణ సంస్థే. దీంతో వారు ఈ సినిమాలో పాత్రలు చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. ఇప్పుడు వీళ్ళ పాత్రలు కూడా వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమా కథ భవిష్యత్తులో జరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే కలియుగాంతం కథే అని టీజర్ చూస్తే తెలుస్తుంది. కలియుగం చివర్లో రాక్షసుల పాలన ఉన్నట్టు, దేవుడు వచ్చి కాపాడతాడని ఇండైరెక్ట్ గా టీజర్ లో చూపించారు. అయితే డైరెక్ట్ గా దేవుడి సినిమాలా కాకుండా వాటిని ఆధారంగా తీసుకొని అప్పటి టెక్నాలజీ, మనుషుల రూపంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Sohel : మోకాళ్ళ మీద కూర్చొని నా సినిమా చూడండి అంటూ ఏడ్చేసిన సోహెల్..
ఈ సినిమాలో ప్రభాస్ కల్కి పాత్ర పోషిస్తున్నది ఇప్పటికే తెలిసిందే. మన పురాణాల ప్రకారం కలియుగాంతం చివర్లో విష్ణుమూర్తి అవతారం కల్కి వస్తుందని అంటారు. అలా ప్రభాస్ ప్రజలని కాపాడటానికి కల్కిగా వస్తాడు. ఇక ఏడుగురు చిరంజీవులు పాత్రలలో రాజమౌళి వేద వ్యాసుడిగా, రానా హనుమంతుడిగా, దుల్కర్ సల్మాన్ పరుశురాముడిగా, విజయ్ దేవరకొండ విభీషణుడిగా, అమితాబ్ బచ్చన్ కృపాచార్యునిగా, నాని అశ్వత్థామగా కనిపిస్తారట. కమల్ హాసన్ విలన్ అని మూవీ యూనిట్ గతంలోనే ఇండైరెక్ట్ గా చెప్పింది. దీంతో అసురుల రాజు బలి చక్రవర్తిగా కమల్ హాసన్ కనిపించబోతున్నట్టు సమాచారాం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఈ రేంజ్ లో నిజంగా ప్లాన్ చేస్తే కల్కి అదిరిపోతుంది. ఈ పాత్రలు చేస్తారో చేయరో కానీ వీళ్ళ గెస్ట్ అప్పీరెన్స్ లు మాత్రం ఉన్నాయని టాలీవుడ్ లో కూడా టాక్ నడుస్తుంది. వీటన్నిటి గురించి క్లారిటీ రావాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.