తల్లి కాబోతున్న ‘నువ్వు నేను’ అనిత..

  • Publish Date - October 13, 2020 / 06:59 PM IST

Anita announced Pregnancy: లాక్‌డౌన్ కారణంగా ఎక్కవ సమయం దొరకడంతో పలువురు సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పెళ్లిళ్లు చేసుకోగా మరికొందరు తాము గర్భవతులమంటూ తమ ఆనందాన్ని ఆడియెన్స్‌తో షేర్ చేసుకున్నారు. తాజాగా ‘నువ్వు నేను’ ఫేం అనిత కూడా ఓ శుభవార్త ప్రేక్షకులతో పంచుకున్నారు. తాను తల్లికాబోతున్నట్లు తెలియజేస్తూ భర్తతో కలిసి ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారామె.


ఆ వీడియోలో రోహిత్ – అనిత పరిచయం, ప్రపోజ్ చేసుకోవడం, పెళ్లి.. ఇలా ప్రతి విషయాన్ని ఆకట్టుకునేలా చూపించారు. వీడియో చూసిన నెటిజన్లు అనిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2013 లో బిజినెస్‌మెన్ రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకున్నారు అనిత. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఈ జంట 2019 లో ప్రసారమైన నాచ్ బలియే సీజన్ 9 అనే డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు అనిత..