Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా గొప్పగా చెప్తారు. రెండు మూడు జనరేషన్స్ ని ఆయన ఇన్‌స్పైర్ చేసారు. ఆయనని ప్రేరణగా తీసుకొని ఎంతోమంది సినీ పరిశ్రమలోకి వచ్చారు. అసలు అంతమంది ఫ్యాన్స్, అన్ని సినిమాలు, స్టార్ డమ్, సేవా కార్యక్రమాలు, ఫ్యామిలీ.. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి.(Chiranjeevi)
హీరోయిన్ ఆషికా రంగనాథ్ చిరంజీవి ఓపిక గురించి మాట్లాడింది. కన్నడ భామ ఆషికా రంగనాథ్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. తాజాగా ఆషికా గత వైభవ అనే కన్నడ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆషికా చిరంజీవి గురించి మాట్లాడింది.
Also See : Rashmika Mandanna : దీక్షిత్ – రష్మిక మందన్న డ్యాన్స్ వర్కింగ్ స్టిల్స్.. ది గర్ల్ ఫ్రెండ్ నుంచి..
ఆషికా రంగనాథ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మనుషుల్ని గౌరవించడం చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయనకు చాలా ఓపిక ఎక్కువ. షూటింగ్ సమయంలో సెట్స్ కు రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందర్నీ ఆయన ఒకేలా గౌరవిస్తారు. చిరంజీవి గారికి వ్యక్తిగత సమయం అసలు ఉండదు. ఈ విషయం గురించి ఓ రోజు ఆయన్ని అడిగాను. మీకు అసలు ఖాళీ ఉంటుందా, ఇంత ఓపిక ఎక్కడిది అని. ఆయన ఆదివారాలు కూడా ఖాళీ ఉండదు అని, ఎక్కడెక్కడ్నుంచో ఫ్యాన్స్ తన ఇంటికి తనని చూడటానికి వస్తారని, వాళ్లకు సమయం కేటాయిస్తానని చెప్పారు. ఆయన ఓపిక చూసి ఆశ్చర్యమేసింది. ఇప్పటి జనరేషన్ నటీనటులకు ఆయనకున్నంత ఓపిక లేదు. అందరికి ప్రేమను పంచే ఆయన మంచి తత్త్వం నాకు ఇష్టం అని తెలిపింది.
దీంతో ఆషికా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజమే మరి అంత ఓపిక ఉంటే గాని ఇంతమంది ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను మెప్పించి మెగాస్టార్ అవ్వలేరు అని చిరంజీవిని మరోసారి అభినందిస్తున్నారు.
Also Read : Kiran Abbavaram : ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో..?