Kiran Abbavaram : ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో..?
రళ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉన్న సమస్యతో ఇబ్బందులు పడే ఓ అబ్బాయి కథగా ఈ సినిమాని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. (Kiran Abbavaram)
Kiran Abbavaram
Kiran Abbavaram : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల K ర్యాంప్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా ‘K ర్యాంప్’ సినిమా హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కింది. దీపావళి కానుకగా K ర్యాంప్ సినిమా ఇటీవల అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది. (Kiran Abbavaram)
థియేటర్స్ లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కేరళ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉన్న సమస్యతో ఇబ్బందులు పడే ఓ అబ్బాయి కథగా ఈ సినిమాని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. క సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం మరోసారి తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఈ సినిమా థియేటర్స్ లో 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.
థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. K ర్యాంప్ సినిమా ఆహా ఓటీటీలో నేడు నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి..
View this post on Instagram
