Green India Challenge : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో రవితేజ హీరోయిన్.. ఎవరెవర్ని నామినేట్ చేసిందంటే..

ప్రతి ఒక్కరూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు ‘ఖిలాడి’ యాక్ట్రెస్ డింపుల్ హయతి..

Green India Challenge

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్‌‌లో సినీ నటి డింపుల్ హయతి మొక్కలు నాటారు.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ పక్కన ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారామె.

Full Kick Song: మాస్ మహారాజా మాస్ సాంగ్.. ఊపు ఊపుతుందిగా..

ఈ సందర్భంగా డింపుల్ హయతి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.

‘ఖిలాడి’ టీం.. హీరో రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటి మీనాక్షి చౌదరి.. ఈ నలుగురికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ విసిరారు డింపుల్.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రజలు తప్పకుండా మొక్కలు నాటాలని చెప్పారు.