Actress Divi Shares Photos with Injured Leg Social Media Post goes viral
Actress Divi : బిగ్ బాస్ ఫేమ్, నటి దివి తాజాగా తన కాలికి కట్టు వేసి ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాలికి ఏదో గాయం అవ్వడం లేదా, లోపల ఎముకలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల అయిన గాయం కోసం వేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు వేశారు. దీంతో దివి కాలికి గట్టిగానే గాయం అయినట్టు తెలుస్తుంది. అయితే ఇది షూటింగ్ లో అయిందా లేక బయట ఎక్కడైనా యాక్సిండెంట్ అయిందా అనేది మాత్రం చెప్పలేదు.
Also Read : Public Events : పబ్లిక్ ఈవెంట్స్ చేయడానికి భయపడుతున్న హీరోలు, నిర్మాతలు..
తన కాలికి కట్టు కట్టగా దానిపై స్కెచ్ తో రాసుకుంటూ బొమ్మలు కూడా వేసుకుంటుంది దివి. ఆ కట్టుతో ఉన్న తన ఫొటోలు షేర్ చేసి.. కొన్నిసార్లు మన పనిని కాలు మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు ఆపేస్తుంది కానీ ఎంటర్టైన్మెంట్ ని ఎందుకు ఆపాలి. అందుకే ఈ కట్టుని నాకు అడ్డంకిగా చూడకుండా బొమ్మలు గీస్తూ అందంగా తయారుచేస్తున్నాను. జీవితం అంటే కష్టాలను తప్పించుకోవడం కాదు. ఇలాంటి సమయంలో కూడా నవ్వాలి. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా ప్రతి సెకండ్ ని ఆస్వాదిస్తున్నాను. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతిదానిలో ఆనందం వెతుక్కుందాం అని పోస్ట్ చేసింది.
దీంతో దివి పోస్ట్ వైరల్ గా మారగా ఫ్యాన్స్, నెటిజన్లు కాలికి ఏమైంది, ఎందుకు కట్టు వేశారు, జాగ్రత్తగా ఉండండి, రెస్ట్ తీసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దివి బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.
Also Read : Jani Master : తెరపైకి మరోసారి జానీ మాస్టర్ కేసు.. మళ్ళీ అరెస్ట్ చేస్తారా?