Jani Master : తెరపైకి మరోసారి జానీ మాస్టర్ కేసు.. మళ్ళీ అరెస్ట్ చేస్తారా?
తాజాగా జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు.

Police opened Charge sheet again on Jani Master
Jani Master : ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు చేసాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు అని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టగా పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి, విచారించి నెల రోజుల పాటు జైలులోనే ఉంచగా బెయిల్ ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు ఆ లేడీ కొరియోగ్రాఫర్ ను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలోనే జానీ మాస్టర్ ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
జానీ మాస్టర్ పై ఆ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 16న ఫిర్యాదు చేయగా పోలీసులు జానీ మాస్టర్ ని సెప్టెంబర్ 19న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి విచారించించి నెల రోజులు జైలులోనే ఉంచారు. అక్టోబర్ 24న షరతులతో కూడిన బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. అక్టోబర్ 25న జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చారు.
ఈ కేసు వల్ల జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా హోల్డ్ లో పెట్టారు. అయితే జానీ మాస్టర్ భార్య మాత్రం తిరిగి ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చాక ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడలేదు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న జానీ మాస్టర్ ఇటీవలే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు, డ్యాన్స్ ప్రాక్టీస్ కి, బయట ఈవెంట్స్ కి వెళ్తున్నారు.
Also Read : Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..
జానీ మాస్టర్ గతంలో కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్ సినిమాలోని సాంగ్ ఇటీవలే రిలీజ్ అయింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరూ అవకాశాలు ఇవ్వట్లేదని జానీ మాస్టర్ బాధపడినట్టు టాలీవుడ్ లో వినిపించింది. అయితే రామ్ చరణ్ కాల్ చేసి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని జానీ మాస్టర్ తెలిపారు. ఇప్పుడు ఈ కేసుని పోలీసులు మళ్ళీ తెరపైకి తీయడంతో జానీ మాస్టర్ మళ్ళీ అరెస్ట్ అవుతారా అని టాలీవుడ్ లో చర్చ నెలకొంది. ఓ వైపు అల్లు అర్జున్ కేసు – మరో వైపు మోహన్ బాబు కేసు – ఇప్పుడు జానీ మాస్టర్ కేసు.. ఇలా ఇయర్ ఎండింగ్ టాలీవుడ్ అంతా కేసులు, పోలీసులతో నడుస్తుంది.