Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..
వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ..

Celebrity Astrologer Venu Swamy Comments on Allu Arjun Horoscope
Venu Swamy – Allu Arjun : తాజాగా సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం చెప్పడం వైరల్ గా మారింది. సంధ్య థియేటర్ ఘటనలో బాధితుడైన శ్రీతేజ్ ని పరామర్శించడానికి వేణుస్వామి నేడు కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం కూడా చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వేణుస్వామి మాట్లాడుతూ.. శ్రీ తేజ్ కోలుకుంటున్నాడు. అతని క్షేమం కోసం నేను మృత్యుంజయ హోమం చేస్తాను. అలాగే ఆ బాబుకి అక్క ఉంది. ఆ పాప కోసం నేను రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాను అంటూ చెక్ ని వాళ్ళ తండ్రికి అందించారు. నేను కూడా సినిమా పరిశ్రమ సొమ్ము తిన్నవాన్ని కాబట్టే వీరికి సహాయం చేద్దామని వచ్చాను అని తెలిపారు.
అనంతరం వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ.. ఏదైనా జాతకాల బట్టే జరుగుతాయి. అల్లు అర్జున్ జాతకరీత్యా ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టే ఇలా జరుగుతుంది. జాతకాలకు ఎవరూ అతీతులు కాదు. వచ్చే సంవత్సరం మార్చ్ 25 వరకు అల్లు అర్జున్ జాతకం బాగోలేదు. ఆ తర్వాత అంతా బానే ఉంటుంది అని తెలిపారు.
అలాగే.. కలియుగంలో డబ్బు ఉన్న చోటే రిస్క్ ఉంటుంది. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఎవరూ కావాలని చేయరు. అందరి జీవితాల్లో తప్పొప్పులు జరుగుతాయి. ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే ముఖ్యం అని అన్నారు. ఇలా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి మొదటిసారి అల్లుఅర్జున్ జాతకం చెప్పడంతో వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Trisha Krishnan : క్రిస్మస్ రోజు నా కొడుకు చనిపోయాడు అంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్..
నేడు శ్రీతేజ్ ని జానీ మాస్టర్ కూడా పరామర్శించి ఆ కుటుంబానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి సహాయం చేస్తామని తెలిపారు. అలాగే అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప నిర్మాతలు కూడా హాస్పిటల్ కి మరోసారి వచ్చి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, పుష్ప నిర్మాతలు 50 లక్షలు మొత్తం 2 కోట్ల రూపాయలు అందచేస్తున్నామని ఆ కుటుంబానికి ఇవ్వమని దిల్ రాజుకి అందచేశారు.