Keerthy Suresh : ముంబైలో ఫొటోగ్రాఫర్లతో కీర్తి సురేష్ టీమ్ వాగ్వాదం.. అభ్యంతకరంగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ..
నిన్న రాత్రి బేబీ జాన్ సినిమా ప్రీమియర్ షోకి కీర్తి సురేష్ వెళ్ళింది.

Keerthy Suresh Team argues with paparazzo in Mumbai after Baby John Movie Premiere
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన వెంటనే ముంబైలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కీర్తి సురేష్, వరుణ్ ధావన్ జంటగా తెరకెక్కిన బేబీ జాన్ సినిమా నేడు డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ ముంబైలో ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఉంది.
అయితే నిన్న రాత్రి బేబీ జాన్ సినిమా ప్రీమియర్ షోకి కీర్తి సురేష్ వెళ్ళింది. షో అయ్యాక బయటకు వచ్చి కార్ లో ఎక్కుతుంటే కీర్తి సురేష్ టీమ్ అక్కడి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లతో గొడవ పెట్టుకున్నారు. సాధారణంగా బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వాళ్ళ ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. ఇందుకు కొన్ని సంస్థలతో సెలబ్రిటీలు ప్రమోషన్స్ కోసం మాట్లాడుకుంటారు.
Also Read : Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చేసింది.. ‘టచ్ లో ఉండు ఓరబ్బీ..’
దీంతో వాళ్ళు సెలబ్రిటీలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇదే క్రమంలో నిన్న కీర్తి సురేష్ బయటకు వచ్చి కార్ ఎక్కుతుంటే పలువురు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా కీర్తి సురేష్ టీమ్ కి చెందిన ఓ మహిళ ఆమె కార్ ఎక్కుతున్నప్పుడు ఎందుకు ఇలా తీస్తున్నారు? అభ్యంతకర వీడియోలను మీరు ఎలా తీస్తారు? కార్ లోకి ఎక్కాక తీసుకోకండి అని అక్కడి ఫొటోగ్రాఫర్లతో వాదించింది.
కీర్తి సురేష్ కార్ లోంచి ఇదంతా గమనించి తన చీర సరిగ్గా ఉందొ లేదో చూసుకుంది. ఇక ఫొటోగ్రాఫర్లు మేమేమి అలా తీయలేదు అంటూ.. ఇలా మాట్లాడకండి, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా అంటూ కీర్తి సురేష్ టీమ్ ని ప్రశ్నించారు. ఇలా వాదులాట జరుగుతుండగానే కీర్తి కార్ వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also See : Eesha Rebba : హీరోయిన్స్ తో కలిసి ఈషారెబ్బ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
ఇలా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు తీసే ఓ సంస్థ ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. మేము స్టార్స్ వీడియోలు వాళ్ళ ఫ్యాన్స్ కోసమే తీస్తాము. కీర్తి సురేష్ టీమ్ లోని వ్యక్తికి, ఫోటోగ్రాఫర్ కి జరిగిన వివాదం కేవలం అపార్థం చేసుకోవడం వలనే జరిగింది అని తెలిపారు. దీంతో పలువురు నెటిజన్లు, కీర్తి ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.