Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చేసింది.. ‘టచ్ లో ఉండు ఓరబ్బీ..’

తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటగా ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు.

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చేసింది.. ‘టచ్ లో ఉండు ఓరబ్బీ..’

Anchor Pradeep Akkada Ammayi Ikkada Abbayi Movie Item Song Released

Updated On : December 25, 2024 / 4:14 PM IST

Anchor Pradeep Item Song : యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం యాంకర్ కెరీర్ కి గ్యాప్ ఇచ్చి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ప్రదీప్ మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా పర్వాలేదనిపించింది. త్వరలో ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుంది. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్‌, భరత్‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Trisha Krishnan : క్రిస్మస్ రోజు నా కొడుకు చనిపోయాడు అంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్..

ఇప్పటికే అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి అని పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ వాడి సినిమాపై హైప్ తెచ్చారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటగా ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘టచ్ లో ఉండు ఓరబ్బీ..’ అంటూ స్పైసీగా సాగిన ఈ ఐటెం సాంగ్ ని మీరు కూడా వినేయండి..

ఈ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా రధన్ సంగీత దర్శకత్వంలో లక్ష్మి దాస, రఘు పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసారు. ఈ పాటలో నటి చంద్రిక రవి పెర్ఫార్మ్ చేసింది. గతంలో చంద్రిక రవి బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో మెప్పించింది. ఇప్పుడు ప్రదీప్ సినిమాలో మరోసారి అలరించనుంది.

ఇక అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి ఈ సినిమాతో యాంకర్ ప్రదీప్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Also Read : Allu Arjun : శ్రీతేజ్ కు అల్లు అర్జున్ కోటి రూపాయలు పరిహారం.. పుష్ప నిర్మాతలు, సుకుమార్ ఎంతిచ్చారంటే..?