Allu Arjun : శ్రీతేజ్ కు అల్లు అర్జున్ కోటి రూపాయలు పరిహారం.. పుష్ప నిర్మాతలు, సుకుమార్ ఎంతిచ్చారంటే..?
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.

Allu Arjun and Pushpa Team gives Huge Compensation Amount to Sree Tej who Injured in Sandhya Theater Incident
Allu Arjun : పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీ తేజ్ ని, అతని కుటుంబాన్ని పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. అల్లు అరవింద్, పుష్ప నిర్మాతలు, దిల్ రాజు కూడా ఆ బాలుడిని, కుటుంబాన్ని పరామర్శించారు.
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ తేజ్ ని పరామర్శించాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ తీసేసారు అని తెలిపారు.
Also Read : Chinni Krishna : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం..
అలాగే.. అల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ఆ కుటుంబానికి పరిహారంగా ఇవ్వనున్నాం. పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ గారు 50 లక్షల రూపాయలు.. మొత్తం 2 కోట్ల రూపాయలను ఆ కుటుంబానికి ఇవ్వవలిసిందిగా FDC చైర్మెన్ దిల్ రాజు గారికి అందచేయడం జరిగింది అని తెలిపారు అల్లు అరవింద్.
దీంతో ఆ కుటుంబానికి ఇప్పుడు 2 కోట్ల పరిహారం అందచేయనున్నారు. అంతకుముందు 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్ ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వడం గమనార్హం. ఆ కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఇచ్చారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా నిధులు సేకరించి ఆ కుటుంబానికి, ఆ బాలుడి వైద్యానికి అందచేస్తామని ప్రకటించారు.
ఇక ఆ బాలుడి వైద్య ఖర్చులు అల్లు అర్జున్ భరిస్తాను అని చెప్పినా ప్రభుత్వం కూడా తాము భరిస్తామని తెలిపింది. ఇక అల్లు అర్జున్ నిన్నే పోలీస్ విచారణకు వెళ్లి వచ్చారు. మరోసారి పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.
Also Read : Oh Bhama Ayyo Rama Glimpse : సుహాస్ ఓ భామ అయ్యో రామా మూవీ గ్లింప్స్ వచ్చేసింది..