Chinni Krishna : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం..
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Writer chinni krishna mother Sushila died
Chinni Krishna : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్ని కృష్ణ తల్లి గారు లక్ష్మి సుశీల గారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తెనాలిలో స్వర్గస్తులైనారు… 75 సంవత్సరాలు ఉన్న ఆవిడ కన్ను మూయడంతో ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారి ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మి సుశీల గారి అంత్యక్రియలు ఈ రోజు స్వగ్రామం తెనాలిలో జరుగుతాయి.
Also Read : Christmas 2024: ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు.. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
ఇక ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు రచయిత తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.