Bobby Deol : అవకాశాలు లేక చచ్చిపోదామనుకున్న స్టార్ హీరో.. ఛాన్స్ ఇచ్చి మళ్ళీ స్టార్ ని చేసిన సందీప్ రెడ్డి వంగ..
బాబీ డియోల్ ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన కొడుకు అన్న మాటలకు చచ్చిపోదాం అనుకున్నాడట.

Sandeep Reddy Vanga Changer Bollywood Star Bobby Deol Life
Bobby Deol : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కొంతకాలం తర్వాత కనుమరుగైపోయారు. మళ్ళీ ఇప్పుడు యానిమల్ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. యానిమల్ సినిమాలో నెగిటివ్ రోల్ లో అదరగొట్టి వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. సౌత్ లో కూడా బోలెడన్ని అవకాశాలు తెచ్చుకుంటున్నారు బాబీ డియోల్. అయితే ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన కొడుకు అన్న మాటలకు చచ్చిపోదాం అనుకున్నాడట.
డైరెక్టర్ బాబీ సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ మాట్లాడుతూ బాబీ డియోల్ గురించి ఈ ఆసక్తికర విషయం గురించి చెప్పారు. బాబీ డియోల్ గారితో యానిమల్ సినిమా గురించి కానీ, సందీప్ రెడ్డి వంగ గురించి కానీ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతారు. ఓ రోజు నాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు అని తెలిపాడు.
Also Read : Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..
నా లైఫ్ ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు బాబీ. ఒకప్పుడు స్టార్ హీరోగా లైఫ్ చూసి తర్వాత ఆల్మోస్ట్ 15 ఏళ్ళు ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను. నా భార్య సంపాదన మీద బతికాను. నా కొడుకు ఒక రోజు నాన్న ఏ పని చేయరా అమ్మ, ఎప్పుడూ ఖాళీగా ఉంటారు అని నా భార్యని అడిగాడు. పక్కగదిలో ఉండి ఆ మాటలు విన్న నాకు చనిపోవాలనిపించింది. వాడు పుట్టక ముందు నేను స్టార్ హీరోని. నా స్టార్ డమ్ వాడు చూడలేదు. వాడు ఎదుగుతున్న సమయంలో ఖాళీగా ఉన్నాను. దాంతో మళ్ళీ గతంలో నేను పనిచేసిన వాళ్ళందర్నీ వేషాలు అడిగాను. కొత్త కొత్తగా ఫొటోలు దిగి పంపించాను. అందరూ చూడటానికి బాగున్నావు అన్నారు కానీ వేషాలు ఇవ్వలేదు. అలాంటి టైంలో మీ తెలుగోడు సందీప్ రెడ్డి వంగ వచ్చి యానిమల్ లో నాకు ఛాన్స్ ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడు అని ఎమోషనల్ అయి చెప్పినట్టు డైరెక్టర్ బాబీ తెలిపారు.
ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కొడుకుగా బాబీ డియోల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలే సాధించి స్టార్ హీరో అయ్యాడు. కానీ ఓ దశలో అవకాశాలు తగ్గిపోయి పదేళ్లలో ఓ పది సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇటీవల యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పోయిన స్టార్ డమ్ అంతా తిరిగొచ్చి మళ్ళీ స్టార్ ఆర్టిస్ట్ గా మారి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.