Site icon 10TV Telugu

Divvya Khosla Kumar : స్టార్ ప్రొడ్యూసర్‌తో నటి విడాకులు?

Divvya Khosla Kumar

Divvya Khosla Kumar

Divvya Khosla Kumar : బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా.. T సిరీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ దంపతులు విడిపోతున్నారా? దివ్య సోషల్ మీడియా ఖాతాలో తన భర్త పేరును తొలగించడం.. టీ-సిరీస్ ఛానల్‌ను అన్ పాలో చేయడంతో ఈ వార్తకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంలో వాస్తవమెంత?

Divvya Khosla Kumar

Nani32 : నాని, సుజిత్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది.. రజినీకాంత్ ‘బాషా’ రేంజ్‌లో..

దివ్యా ఖోస్లా 2004 లో ‘లవ్ టుడే’ అనే తెలుగు సినిమాతో కెరియర్ ప్రారంభించారు. ‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగులు వేశారు. 2014 లో ‘యారియాన్’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. భర్త భూషణ్ కుమార్‌తో కలిసి అనేక సినిమాలు నిర్మించారు. దివ్య చివరగా మీజాన్ జాఫ్రీ, పెరల్‌వి పూరితో కలిసి ‘యారియాన్2’ లో కనిపించారు.  మళయాళ సినిమా ‘బెంగళూరు డేస్’ సినిమాకి రీమేక్ అది.

Divvya Khosla Kumar 2

కాగా ఈ నటి తన భర్తతో విడిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 2005 లో వీరికి వివాహం కాగా 2011 లో ఒక అబ్బాయి పుట్టాడు. 19 సంవత్సరాల వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దివ్యా ఖోస్లా సోషల్ మీడియా ఖాతాలో తన పేరు పక్కన తన భర్త పేరును తొలగించడంతో పాటు టీ-సిరీస్ ఛానల్‌ను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత బలమిస్తోంది. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని భూషణ్ కుమార్ టీమ్ చెబుతోంది. ఇన్‌స్టాగ్రాంలో పేరు మార్పు జ్యోతిష్య కారణాలతో తొలగించారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో దివ్యా ఖోస్లా-భూషణ్ కుమార్ దంపతులు స్పష్టం చేయాల్సి ఉంది.

 

Exit mobile version