Honey Rose : అక్కడ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్
'ఆలయం' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళి ముద్దు గుమ్మ హనీ రోజ్.వీరసింహారెడ్డితో యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసింది.
- Thota Vamshi Kumar
- Published On : June 18, 2023 / 05:20 PM IST
Honey Rose
Actress Honey Rose : ‘ఆలయం’ అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళి ముద్దు గుమ్మ హనీ రోజ్(Honey Rose). ఆ తరువాత ‘ఈ వర్షం సాక్షి’గా అనే సినిమాతో వచ్చినప్పటికి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. ఇటీవల ‘వీరసింహారెడ్డి’తో యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. ఈ సినిమాలోని ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించినా కూడా తెలుగులో అమ్మడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. మలయాళంలో పెద్ద స్టార్ హీరోయిన్ అయిన హనీ రోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ తేనేకళ్ల సుందరి ఓ రిస్కీ పని చేసి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇటీవల హనీ రోజ్.. ఐర్లాండ్‌కు వెళ్లింది. అక్కడ బ్లార్నీ అనే కోట ఉంది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన బ్లర‍్నే స్టోన్ ని రిస్క్ చేసి ముద్దు పెట్టుకుంది. తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని కిస్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
SPY Movie : సుభాష్ చంద్రబోస్ మిస్టరీ సీక్రెట్ రివీల్‌కి డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ!
1991 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమత్తోం అనే ప్రాంతంలో హనీ రోజ్ జన్మించింది. ఆమె అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ధ్వని హంసిని, పొన్ను అనే ముద్దు పేర్లు ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. సెయింట్ జేవియర్స్ ఉమెన్ కాలేజీలో ఇంగ్లీష్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను పొందింది. 2005లో బాయ్‌ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ముధల్ కనవే అనే సినిమాతో తమిళ్‌లోకి అడుగుపెట్టింది. 2008లో ఆలయం సినిమా ద్వారా తెలుగులో నటించింది. అయితే.. వీరసింహారెడ్డితో ఆమెకు క్రేజ్ లభించింది.
