SPY Movie : సుభాష్ చంద్రబోస్ మిస్టరీ సీక్రెట్ రివీల్‌కి డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ!

నిఖిల్ స్పై రిలీజ్ డేట్ పై కొన్ని రోజులు నుంచి రూమర్స్ వస్తుండడంతో ఆడియన్స్ లో కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో మూవీ టీం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాని..

SPY Movie : సుభాష్ చంద్రబోస్ మిస్టరీ సీక్రెట్ రివీల్‌కి డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ!

Nikhil Siddharth Iswarya Menon SPY releasd on june 29

Updated On : June 18, 2023 / 4:48 PM IST

Nikhil Siddharth SPY : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస పాన్ ఇండియా సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘స్పై’ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మూవీ పైభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కూడా సూపర్ గా ఉండడంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Dil Raju : దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా దిల్ రాజు..

గతంలో ఈ సినిమాని జూన్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో విడుదల తేదీని వేయకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు రూమర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. దీంతో ఆడియన్స్ లో గందరగోళం ఏర్పడింది. దీంతో మూవీ టీం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాని చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తున్నట్లు నిఖిల్ కన్‌ఫార్మ్ చేశాడు. సినిమా పక్కా క్వాలిటీతో రాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో మూవీ రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.

Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో అంటున్న సుధీర్ బాబు.. కోటి రూపాయిల లాటరి టికెట్!

కాగా ఈ సినిమాని ‘గర్రి బిహెచ్’ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల హీరోహీరోయిన్ పై ఒక సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. శ్రీచరణ్ పకల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.