Honey Rose: పెళ్లికి రెడీ అయిన హనీ రోజ్.. దానికోసం ఏమైనా చేస్తుందట!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించిన హనీరోజ్ ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ మంచి సినిమా ఛాన్స్‌లు పట్టేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యిందట.

Actress Honey Rose Says She Is Ready For Marriage

Honey Rose: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించిన హనీరోజ్ ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ బొద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను హనీరోజ్ బాగా వినియోగించుకుంది. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు హనీరోజ్ ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది.

Honey Rose: స్టైలిష్ లుక్స్‌తో చితక్కొడుతున్న హనీ రోజ్.. ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా?

ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ మంచి సినిమా ఛాన్స్‌లు పట్టేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యిందట. తాజాగా విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్‌కు వెళ్లిన హనీరోజ్, అక్కడ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లుగా హనీ రోజ్ తెలిపింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని.. వివాహ బంధం బలంగా ఉండటం కోసం తాను ఏమైనా చేసేందుకు సిద్ధమని హనీరోజ్ చెప్పుకొచ్చింది. హనీరోజ్ పెళ్లికి రెడీ అని చెప్పడంతో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Honey Rose : వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. రెడ్ డ్రెస్‌లో రెడ్ రోజ్‌లా ఉన్న హనీ రోజ్..

2005లో ‘బాయ్‌ ఫ్రెండ్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినిమాల్లోకి వచ్చింది ఈ భామ. తెలుగులో శివాజీ నటించిన ‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, కొంత గ్యాప్ తీసుకుని వరుణ్ సందేశ్ ‘ఈ వర్షం సాక్షిగా’ మూవీలో నటించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో మళ్లీ ఇన్నేళ్లకు టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్లు హనీరోజ్ తెలిపింది.