Malavika Mohanan : ఎవరైనా నా చేయి పట్టుకోండి.. ఆ హీరోయిన్ పోస్టు వైరల్
నటి మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలు, పోస్టులతో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
- Lakshmi 10tv
- Published on- December 1, 2023 / 04:09 PM IST
Malavika Mohanan
Malavika Mohanan : మోడల్‌గా కెరియర్‌గా మొదలుపెట్టి హీరోయిన్గా ఎదిగారు మాళవిక మోహన్. ఈ కేరళ కుట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్గా మాళవిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
Salaar Trailer : సలార్ ట్రైలర్ ఎన్ని నిముషాలు ఉండబోతుందో తెలుసా? రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే..
నటి మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. రీసెంట్గా ఈ నటి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. సినిమా నిర్మాణంలో తనను అత్యంత భయపెట్టే అంశం డబ్బింగ్ అని.. తను డబ్బింగ్ చెప్పేటపుడు ఎవరైనా వచ్చిన తన చేయి పట్టుకుంటారా? అని అడుగుతూ పోస్టు పెట్టారు. మాళవిక అంతలా రిక్వెస్ట్ చేస్తే అభిమానులు స్పందించకుండా ఉంటారా?. ‘వై..నాట్’.. ‘ఆల్వేస్ విత్ యూ’ అంటూ కామెంట్లు పెట్టారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ డ్రాప్ 3 వచ్చేసింది.. ఈసారి ఎమోషనల్ వెర్షన్..
మొదట మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మాళవిక తరువాత హీరోయిగా మారారు. రజనీకాంత్ సినిమా పేటలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్టర్‌లో విజయ్‌కి, మారన్‌లో దనుష్‌కి జోడిగా నటించారు. ప్రస్తుతం విక్రమ్‌కి జోడిగా తంగలాన్ సినిమాలో నటిస్తున్నారు. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా పార్వతి నటిస్తున్నారు. జనవరి 26 న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
