Salaar Trailer : సలార్ ట్రైలర్ ఎన్ని నిముషాలు ఉండబోతుందో తెలుసా? రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే..

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని నేడు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ నిడివి ఎన్ని నిముషాలు ఉంటుందో కూడా ప్రకటించారు.

Salaar Trailer : సలార్ ట్రైలర్ ఎన్ని నిముషాలు ఉండబోతుందో తెలుసా? రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే..

Prabhas Prashanth Neel Salaar Part 1 Cease Fire Trailer Length Announced

Updated On : December 1, 2023 / 3:53 PM IST

Salaar Trailer : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. ఇక నేడు డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నారు. ట్రైలర్‌ రిలీజ్ తో ఈ మూవీ ప్రమోషన్స్ కి తెరలేపుతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ డేట్, టైంని అనౌన్స్ చేశారు మేకర్స్.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని నేడు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ నిడివి ఎన్ని నిముషాలు ఉంటుందో కూడా ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్స్ ఉండబోతున్నట్టు తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు. ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టు. అనౌన్స్ చేసిన టైంకి ఆ ట్రైలర్ ని అందరికి కనపడేలా పబ్లిక్ చేయనున్నారు. ఇక ట్రైలర్ తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా రానుంది.

Also Read : Allari Naresh : సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త కొత్త టైటిల్స్‌తో అదరగొడుతున్న అల్లరి నరేష్.. నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

సలార్ ట్రైలర్ ఇంత లెంత్ ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్ లో అసలు ప్రభాస్ ఫేస్ కూడా చూపియ్యలేదు. మరి ట్రైలర్ లో ప్రభాస్ ని ఎంత సేపు చూపిస్తారో చూడాలి. ఇక ట్రైలర్ కింద కామెంట్స్ లో ఐదు బెస్ట్ క్యాప్షన్స్ చెప్పిన వారికీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కూడా ఇస్తామంటూ చిత్రయూనిట్ ప్రకటించారు.