Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!

నటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ, చెన్నైలోని ఎంజీఎం....

Actress Meena Letter To Media After Her Husband Death

Actress Meena: నటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నటి మీనా షాక్‌లోకి వెళ్లిపోయింది. తన భర్తను కాపాడుకునేందుకు మీనా చాలా కష్టపడింది. కానీ ఆమె ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది.

Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

ఇక తన భర్త మృతితో తన కుటుంబంలో విషాదం నెలకొందని మీనా తాజాగా వెల్లడించింది. భర్త మరణాంతరం మీనా తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి పలు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి ఇలాంటి వాటిని ప్రచారం చేయవద్దంటూ ఆమె మీడియాను భాగోద్వేగ మనసుతో కోరుకుంది. ‘‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి.’’ అంటూ మీనా తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి వేడుకుంది.

Meena : నటి మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా..

కష్టకాలంలో తమకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మీనా ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, సన్నిహితులు, మిత్రులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. తన భర్త కోలుకోవాలని తనతో పాటు కోరుకున్న తన అభిమానులకు రుణపడి ఉంటానని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మీనా ఫ్యాన్స్‌ను భాగోద్వాగాలకు గురిచేస్తోంది.