Megha Akash Wedding : ఘనంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..

తాజాగా నేడు మేఘ ఆకాష్ పెళ్లి విష్ణుతో ఘనంగా జరిగింది.

Actress Megha Akash Wedding Happened with Vishnu Photos goes Viral

Megha Akash Wedding : తెలుగు, తమిళ్ సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మేఘ ఆకాష్ ఇటీవల విష్ణు అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా మేఘ ఆకాష్ పెళ్లి పనులకు సంబంధించిన ఫొటోలు, మెహందీ, సంగీత్ ఫొటోలు వైరల్ అయ్యాయి.

Also Read : NTR : అప్పుడు చాలా భయపడ్డాను.. దేవర ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ వ్యాఖ్యలు..

తాజాగా నేడు మేఘ ఆకాష్ పెళ్లి విష్ణుతో ఘనంగా జరిగింది. చెన్నైలో వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్ళికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం మేఘ ఆకాష్ – విష్ణు పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.