Michelle Yeoh : ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి ఆసియన్ మహిళగా చరిత్ర సృష్టించిన Michelle Yeoh

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి రికార్డులు మరిన్ని కూడా నమోదయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా మలేషియన్ నటి MICHELLE YEOH తను నటించిన...............

Michelle Yeoh :  ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా ముగిసాయి. పలు రకాల కేటగిరీలలో అనేక సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. మన ఇండియా నుంచి నామినేట్ అయిన వాటిల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫాంట్ విష్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాయి.

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి రికార్డులు మరిన్ని కూడా నమోదయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా మలేషియన్ నటి MICHELLE YEOH తను నటించిన Everything Everywhere All at Once సినిమాకు ఆస్కార్ అవార్డు సాధించింది. దీంతో బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఆసియన్ మహిళగా MICHELLE YEOH సరికొత్త చరిత్ర సృష్టించింది.

MICHELLE YEOH మలేషియాకు చెందిన నటి అయినా హాంగ్ కాంగ్ సినిమాలతోపేరు తెచ్చుకొని అనంతరం పలు చైనా, హాలీవుడ్, కొరియన్, జపాన్ సినిమాల్లో నటించింది. దాదాపు 30 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తుంది MICHELLE YEOH. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంది. 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు Everything Everywhere All at Once సినిమాలో నటించి అందర్నీ మెప్పిస్తుంది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే రిలీజయిన దగ్గర్నుంచి ఇప్పటివరకు దాదాపు 50 అవార్డులకు పైగా సాధించింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది MICHELLE YEOH. ఇక ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్ అవార్డులను అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు