Actress Mirnaa Menon Post a Photo with Nagarjuna and Calls him Annayya
Mirnaa Menon : టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) 60 ఏళ్ళు దాటినా ఇంకా నవ మన్మథుడిగా కనిపిస్తాడు. నాగ్ ఏం తింటాడో కానీ ఆయన్ని చూసి ఈ ఏజ్ లో కూడా ఇంత ఫిట్నెస్, ఇంత అందం ఏంట్రా బాబు అనుకుంటారు. ఇక అమ్మాయిల్లో అయితే ఇప్పటికి కూడా నాగార్జునకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలకి ఆయన మన్మధుడు. నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్ పాడినట్టు గ్రీకువీరుడు నా రాకుమారుడు.. అని అమ్మాయిలంతా నాగార్జున కోసం పాడిన వాళ్ళే. నాగార్జునని ఏ అమ్మాయి కూడా అన్నయ్య అనదు.
కానీ తాజాగా ఓ హీరోయిన్ నాగార్జునని అన్నయ్య అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మలయాళీ భామ మిర్నా మీనన్ తెలుగులో క్రేజీ ఫెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన ఉగ్రం సినిమాతో మెప్పించింది. ఇప్పుడు సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో రాబోతుంది. నాగార్జున నా సామిరంగ(Naa Saami Ranga) సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh) కూడా ఉన్నాడు. నాగార్జున ప్రాణ స్నేహితుడి పాత్రని అల్లరి నరేష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ కి జోడిగా మిర్నా మీనన్ ని తీసుకొచ్చారు.
Also Read : Animal Movie : ముంబైలో భారీగా ‘యానిమల్’ సక్సెస్ పార్టీ.. తరలివచ్చిన తారలు..
తాజాగా నా సామిరంగ షూటింగ్ సెట్ లో నాగార్జునతో దిగిన ఓ ఫోటోని మిర్నా మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా అన్నయ్య కింగ్ నాగార్జున సర్ అని పోస్ట్ చేసింది. నాగార్జునని అన్నయ్య అనడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నాగార్జునని అన్నయ్య అందంటే మాములు విషయం కాదు అని పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ భార్యగా చేస్తుండటంతో నాగార్జునని అన్నయ్య అని పిలిచి ఉంటుంది. సినిమా పాత్రనే ఇలా పోస్ట్ చేసింది అని మరికొంతమంది క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా నాగార్జునని అన్నయ్య అంటూ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది మిర్నా మీనన్. ఇక నా సామిరంగ సినిమా సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ కానుంది.