Animal Movie : ముంబైలో భారీగా ‘యానిమల్’ సక్సెస్ పార్టీ.. తరలివచ్చిన తారలు..
యానిమల్ సినిమా ఇంతటి భారీ విజయం సాధిచడంతో చిత్రయూనిట్ ముంబైలో నిన్న రాత్రి భారీ పార్టీ నిర్వహించింది.

Animal Movie Unit Celebrated Success Bash in Mumbai with Bollywood Stars
Animal Movie Success Bash : సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ లో కూడా అన్ని భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజయింది. ఏకంగా 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాన్న సెంటిమెంట్, లవ్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో యానిమల్ సినిమా అందర్నీ అబ్బురపరిచింది.
సందీప్ వంగ ఈ సినిమాతో బాలీవుడ్ కి మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్, అనిల్ కపూర్, బబ్లూ పృద్విరాజ్.. ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రకి పేరొచ్చింది. ఇక ఫిమేల్ క్యారెక్టర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
యానిమల్ సినిమా ఇంతటి భారీ విజయం సాధిచడంతో చిత్రయూనిట్ ముంబైలో నిన్న రాత్రి భారీ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి యానిమల్ చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా విచ్చేశారు. రణబీర్ తన భార్య ఆలియాతో కలిసి వచ్చాడు. అలాగే మహేష్ భట్, నీతూ కపూర్, రష్మిక మందన్న, తమన్నా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, మానుషీ చిల్లర్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. ఇంకా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు యానిమల్ సక్సెస్ పార్టీకి వచ్చి సందడి చేశారు. దీంతో యానిమల్ సక్సెస్ పార్టీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక యానిమల్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. అలాగే యానిమల్ సినిమాకి యానిమల్ పార్క్ అని సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ 2026 లో ఉండొచ్చని సమాచారం.