కరోనాని పొట్టలోకి తీసుకెళ్లి చంపేద్దాం..

కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన రోజా..

  • Publish Date - April 3, 2020 / 11:14 AM IST

కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన రోజా..

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పట్టున ఉంటున్న సెలబ్స్ సోషల్ మీడియా పుణ్యమా అని తమ రోజువారి పనుల తాలుకు వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

అలాగే కరోనాపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కరోనా గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : మలైకా లాక్‌డౌన్ లడ్డూలు.. డైవర్స్ అప్పుడు నా కొడుకు ఏం అన్నాడంటే..

‘‘కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరం సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేద్దాం.. చేతులు శుభ్రంగా పెట్టుకుందాం.. అలాగే అప్పుడప్పుడు వేడినీళ్లు తాగుతూ.. ఆ కరోనాని అలా పొట్టలోకి తీసుకెళ్లి చంపేద్దాం.. ఓకేనా..’’ అంటూ స్కూల్ టీచర్‌లా రోజా వివరించిన తీరుకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.. అలాగే కొందరు ఇంత తేలికగా కరోనా తగ్గిపోతుందా అని కూడా ట్వీట్లు చేస్తున్నారు.