Nivita : అప్పట్లో పవన్ కళ్యాణ్ తో స్టేజి మీద వైరల్ అయిన నటి.. ఇప్పుడు జనసేనలోకి..
తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో సినీ నటి నివిత జనసేన పార్టీలో చేరింది.(Nivita)
- Saketh U
- Published On : February 7, 2026 / 11:03 AM IST
Nivita
Nivita : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల మీద కూడా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తెలంగాణ నాయకులతో మీటింగ్ జరిగింది. RK సాగర్, తనీష్, రామ్ తాళ్లూరి.. ఇలా పలువురు సినీ ప్రముఖులు కూడా రోజూ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచిపనులతో మరింతమంది సినీ ప్రముఖులు ఆయన పార్టీలోకి వెళ్తున్నారు.(Nivita)
తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో సినీ నటి నివిత జనసేన పార్టీలో చేరింది. రామ్ తాళ్లూరి ఆమెని పార్టీ కండువ కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో నివిత మరోసారి వైరల్ గా మారింది.
Also Read : Arjun Sarja : తాగొచ్చి అభిమాని చేసిన పనికి.. యాక్షన్ కింగ్ అర్జున్ ఏం చేసాడో తెలుసా..?
కొన్నాళ్ల క్రితం హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో నటించిన నివిత అనే నటిని పైకి పిలిచి మాట్లాడటం, ఆమె పవన్ ని పట్టుకొని ఫోటో దిగి సంతోషంలో స్టేజిపైనే గంతులేయడం, పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకోవాలని ప్రయత్నించడంతో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ సంఘటన తో నివిత సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ ఫేమ్ తో అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి తను పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో తెలిపింది.
పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సమయంలో స్టేజిపై సందడి చేసి వైరల్ అయిన నివిత ఇప్పుడు జనసేన పార్టీలో చేరడంతో మరోసారి నివిత వార్తల్లో నిలిచింది. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఏదైనా ఎన్నికల్లో నివిత పోటీ చేస్తుందేమో చూడాలి.
Also Read : Amardeep : వామ్మో అమర్ దీప్ ని ఎత్తుకుని రచ్చ చేసిన అరియనా గ్లోరీ.. వీడియో వైరల్..
