Amardeep : వామ్మో అమర్ దీప్ ని ఎత్తుకుని రచ్చ చేసిన అరియనా గ్లోరీ.. వీడియో వైరల్..
అమర్ దీప్ ని అరియనా గ్లోరీ ఎత్తుకొని థియేటర్లో సందడి చేసింది. (Amardeep)
Amardeep
Amardeep : బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్న సీరియల్ నటుడు అమర్ దీప్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అమర్ దీప్ హీరోగా తెరకెక్కిన సుమతి శతకం సినిమా ఫిబ్రవరి 6న రిలీజయింది. అమర్ దీప్, మూవీ టీమ్, అతని ఫ్రెండ్స్ మరికొంతమంది సెలబ్రిటీలు కలిసి థియేటర్ లో జనాల మధ్య సినిమాని చూసారు.(Amardeep)
సినిమా అయిన తర్వాత టీమ్ అంతా సంబరాలు చేసుకున్నారు. అమర్ దీప్ హీరోగా మొదటి సినిమా కావడంతో అందరూ అతన్ని ప్రశంసించారు. ఈ క్రమంలో నటి, బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ కూడా రావడంతో తన ఆనందాన్ని అమర్ దీప్ ని ఎత్తుకొని వ్యక్తపరిచింది. అమర్ దీప్ ని అరియనా గ్లోరీ ఎత్తుకొని థియేటర్లో సందడి చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read : Divija Prabhakar : యాటిట్యూడ్ స్టార్ చెల్లి హీరోయిన్ గా.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ఫస్ట్ లుక్ లాంచ్..
వామ్మో అరియనా అమర్ దీప్ అలా ఎత్తుకుందేంటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అయితే అమర్ దీప్, అరియనా గ్లోరీ మధ్య మంచి అనుబంధం ఉందని, ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని గతంలో అరియనా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.
అరియనా అమర్ దీప్ ని ఎత్తుకున్న వీడియో మీరు కూడా చూసేయండి..
